అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లఖ్‌నవూ వేదికగా శనివారం జరగనున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక పరిస్థితుల ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. బకాయిల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి ముందుకెళ్లాలనే అంశాలపై మంత్రులు, సంబంధిత అధికారులు సమాలోచనలు చేయనున్నారు. అంతేగాకుండా నష్టాల నుంచి రాష్ట్రాల డిస్కంలు కోలుకునేందుకు విద్యుత్ శాఖ మంత్రులు కేంద్రానికి పలు వినతులు చేయడంతో పాటు, కేంద్రం నుంచి వచ్చే పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయ, సహకారాలు కోరే అవకాశం ఉంది.
Prajavartha Online Telugu News