-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్
-ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల పై 50% వడ్డీ రాయితీ కి నేడే చివరి అవకాశం అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయల పై 50 శాతం వడ్డీ రాయితీతో చెల్లించుటకు మార్చి 31, 2025 చివరి అవకాశం అయినందున, రంజాన్ పండుగ సందర్భంగా సెలవు దినము అయినప్పటికీ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్ అన్యును ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నగర పరిధిలో గల అన్ని సచివాలయంలో కూడా పనులు చెల్లించవచ్చని అన్నారు. ప్రజలు ఆన్లైన్ లో కూడా పన్ను బకాయిలను చెల్లించవచ్చని, ఆన్లైన్లో కూడా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ఉందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన పన్నుబకాయలను చెల్లించి వడ్డీ పై 50% రాయితీని పొందగలరని తెలిపారు.
Prajavartha Online Telugu News