Breaking News

వడ్డీ రాయితీతో ఆస్తి పన్ను చెల్లించడానికి నేడే (సోమవారమే) ఆఖరి రోజు… : కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి పన్ను చెల్లించటానికి సోమవారం ఒక్కరోజే గడువు ఉన్నందున ఈ నెల 31వ తేదీ రంజాన్ పండుగ సెలవు రోజైనప్పటికీ పన్నుచెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని పన్నుచెల్లించడానికి కేవలం ఒక్క రోజే గడువు ఉన్నందున, సెలవు రోజైన సోమవారం పన్ను చెల్లించడానికి వచ్చే వారికి వీలుగా ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించిన నాటి నుండి ఆదివారం వరకు షుమారు 17,850 మంది రూ.19.90 కోట్లు పన్ను చెల్లించారన్నారు. కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఆదివారం ఒక్కరోజే రూ.2 కోట్లు పన్ను వసూళ్లు జరిగిందని, వడ్డీ రాయితీతో పన్ను చెల్లించడానికి చివరి అవకాశం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *