Breaking News

జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,841 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం

-ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్, 2025 ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్ 1 వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 7.00 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని ఆదేశిస్తూ, జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,841 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచిస్తూ ఏప్రిల్ 1 వ తారీఖున మంగళవారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని ఈ నెల మార్చి29 శనివారం నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీ లో ఉంచుకొన్న మేరకు, ఏప్రిల్ 1 వ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయుట కొరకు వారి పంపిణి ప్రదేశాలకి చేరుకొని ఉదయం 6.45 గం లకు యాప్ ఓపెన్ అయ్యాక పింఛను దారులకు పింఛన్లు పంపిణి చేపట్టాలని సూచించారు.

ఏప్రిల్ 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ పింఛనుదారు ఇంటినుండి ఖచ్చితంగా 300 మీటర్ల పరిది దాటితే పని చేయదని, పింఛనుదారుల ఇంటివద్దనే పింఛను ఇవ్వాలని, ఏ కారణం చేతనైనా ఇంటివద్ద ఇవ్వడం కుదరక పోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలయునని తెలియచేసారు. పింఛను దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా పింఛను పంపిణీ చేయవలయునని ఆదేశించడమైనది. ఏ కారణం చేతనైనా పింఛను తీసుకోని లబ్ధిదారులకు 02.04.2025 తేదీ వరకు ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,841 మంది ఫించన్ దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, మంగళవారం అదే రోజు 100 శాతం ఫించన్ల పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మునిసిపల్ కమీషనర్లు పింఛను పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ నెల 1 వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి పంపిణీ ప్రదేశానికి ఉదయం 6.30 గం.ల లోగా చేరుకుని తప్పకుండా ఆరోజు ఉదయం 7.00 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు . ప్రతి పెన్షన్ పంపిణి చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలని, అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయవలెనని తెలియజేశారు. ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమ శిక్షణా చర్యలు తీసుకోబడునని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే గత నెలలలో ఏదేని కారణంతో ఫించన్ తీసుకోని వారికి ఈ నెల పించన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. కావున ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులను, మునిసిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫించన్ దారులకు అందరికీ IVRS విధానం పై వ్యక్తిగతంగా తెలియచేయాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *