పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని అసిస్టెంట్  ప్రొఫెసర్ డా. సి. హెచ్. సునీత పేర్కొన్నారు. ఆదివారం కోరుకొండ మండలం శ్రీ రంగ పట్నం గ్రామంలో జరుగుతున్న జాతీయ సేవా పథకం లో భాగంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు మూడవ రోజు గ్రామ వీధులలో స్వచ్ఛ భారత్ ర్యాలీ మరియు పెరటి తోటల పెంపకం పై అవగాహనా కార్యక్రమాల ను చేపట్టారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యతే అంటూ వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థిని, విద్యార్థులు స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామ వీధులను శుభ్ర పరిచారు. ఈ ర్యాలీ లో వ్వవసాయ కళాశాల ఎన్. ఎస్. ఎస్. ఆఫీసర్ డా. సిహెచ్. సునీత, డి. సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మద్దాల రమణ పాల్గొన్నారు. పెరటి తోటల పెంపకం పై అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సి. హెచ్. సునీత రైతులకు అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *