-రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులు
-రాష్ట్రంలో పెట్టుబడుదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తోందన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధప్రదేశ్ ను ఏవియేషన్ హాబ్ గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. నేడు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేసిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.. అందులో భాగంగా నేడు సచివాలయంలోని ఆర్ & బీ మంత్రి కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసి రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పెట్టుబడుదారులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న ఔత్సాహిక పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరడం జరిగింది..
ముఖ్యంగా ఈ రోజు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చిన పెట్టుబడుదారుల వివరాలు :
• మాగ్నం వింగ్స్ సీఈవో అభిరామ్ చావా : ఈవిటోల్స్ & డ్రోన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రంగంలో మొత్తంగా రూ. 1500 కోట్ల పెట్టుబడుల్లో.. తొలి దశలో రూ. 350 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు..
• అరిస్టాటిల్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ శిరీష్ : ఎయిర్ క్రాప్ట్ సిమ్యూలేటింగ్ ట్రైనింగ్ యూనిట్ రంగంలో రూ. 600 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..
• ఈ ప్లెయిన్ కంపెనీ డైరెక్టర్ కెప్టెన్ దివ్య : ఈవిటోల్స్ & ఎయిర్ టాక్సీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రంగంలో మొత్తంగా రూ. 1200 కోట్ల పెట్టుబడుల్లో.. తొలి దశలో రూ. 270 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారు..
• భారత్ ఏవియేషన్ డైరెక్టర్ జోసఫ్ పొన్నుస్వామి దాస్ : ఏవియేషన్ సెక్టార్ లో మెయింటెనెన్స్ – రిపేర్స్ & ఓవర్ హాల్స్ (MRO) సెంటర్ స్థాపనకు కొరకు ముందుకు రావడం జరిగింది..
Prajavartha Online Telugu News