Breaking News

తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు భేష్

-16వ ఆర్థిక కమిషన్ బృందం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూకివాకంలోని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబిచ్చారు.

గురువారం ఉదయం తూకివాకం నందలి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నుండి సంపద కేంద్రం) ను పరిశీలించిన 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మ్యాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితర సభ్యులు పరిశీలించగా సదరు ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ కంపోస్టు, బయో మెథనైజేశన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి ప్రిన్సిపాల్ సెక్రటరీ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్, జే.నివాస్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య పలు అంశాలు వివరించారు.

ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుండి సంపద తయారీ విధానంపై వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్త ను నిర్వహణ చేసి కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజూ ఉత్పతి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్వహణ చేసి ఆరు రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పతి అయిన ఇసుక, గుల్ల తో పేవర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *