Breaking News

నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో ప్రయాణికుల దాహార్తిని తీర్చే దిశగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

-ఈ వేసవి కాలంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగవద్దు – MLA బొండా ఉమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
” సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలని స్కూల్ సెంటర్ వద్ద గురువారం డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి స్కూల్ పిల్లలకు పాదచారులకు చల్లటి మంచినీరు, ఈరోజు ఏర్పాటు చేసిన సుగంధి వాటర్ ను ప్రజలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :- వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, .తప్పనిసరి అయితేనే తప్ప ప్రజలు మధ్యాహ్నం పూట ఎలా నుండి బయటకు రావద్దని, వచ్చిన తగు జాగ్రత్తలు తీసుకొవాలి అని, నియోజకవర్గంలోని పలు డివిజన్లో, జన సంచారం ఎక్కువగా ఉండే కూడలి సెంటర్లలో మా తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాఠశాలలకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని, ఈరోజు ఈ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎండాకాలం వెళ్లే వరకు కూడా దీనిని కొనసాగిస్తారని నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుతుంది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో  డివిజన్ అధ్యక్షులు M మల్లేశ్వరరావు, ఇన్చార్జి బుగత శ్రీరాములు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కంచి ధన శేఖర్, మైనంపాటి సుబ్బలక్ష్మి, సావిత్రి, రామరాజు, కంచేటి నాగరాజు, జనసేన నాయకులు సోమనాదం తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *