గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో రూ.5కే ఆహారం అందడంపట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం టిఫిన్ చేసినా రూ.30కి పైగా ఖర్చు అవుతుందని, కాని అన్న క్యాంటీన్లలో పూటకు రూ.5కే ఆహారం అందుతుండం పట్ల ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్ ల్లో అందే ఆహారంపై ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తున్నఅభిప్రాయాల మేరకు పలు మార్పులు చేస్తున్నారన్నారు. క్యాంటీన్ కి వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్షయ పాత్ర సిబ్బందిని, నోడల్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News