విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న (శనివారం) ‘‘రన్ ఫర్ జీసస్’’ను నిర్వహిస్తున్నామని దీనిని అన్ని క్రైస్తవ సంఘాలు జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామని మాజీ డిప్యూటి మేయర్ సిరిపురపు ఫిలిఫ్స్ గ్రిటన్, కాండ్రు సుధాకర్‌బాబు తెలిపారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 6.00 గం.కు బెంజ్ సర్కిల్ సెయింట్ పాల్స్ కెథడ్రల్ నుండి 5వ నెంబర్ రోడ్ నుండి సిఎస్ఐ సెయింట్ బాసిలికా వరకు యేసు క్రీస్తు పునరుదనాన్ని‘‘రన్ ఫర్ జీసస్’’ (యేసు కొరకు పరుగు) వుందన్నారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News