-గుమ్మడి గోపాలకృష్ణను అభినందించిన నేతలు
-బుక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరిన టీడీ జనార్దన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పుడతారు మానవులు ఎందరో చరిత్రను సృష్టించేది కొందరే అంటూ చంద్రన్నపై నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రాసిన అద్భుతమైన పాటను అలాగే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు ప్రజలకోసం, బడుగు బలహీన వర్గాల సాధికారతకోసం, నాడు ఉమ్మడి రాష్ట్ర సంక్షేమం కోసం, నేడు నవ్యాంధ్ర నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిపై పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ ఫోటోలతో రూపొందించిన మన చంద్రన్న బుక్ ను నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఘనంగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేసిన మంచిని మరచిపోతున్న ఈ రోజుల్లో ప్రజల శ్రేయస్సుకోసం, వారి ఉన్నతికోసం ప్రజా నాయకుడు చంద్రన్న చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకొచ్చిన మన చంద్రన్న బుక్ అద్భుతమని.. ఎంతో వివరంగా ఫోటోలతో చంద్రబాబు 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన ప్రజలకు చేసిన మేలు స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. దీన్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, నాడు రాష్ట్రంలో విధ్వంసక పాలనపై గోపాలకృష్ణ రాసిన పాటలు అందరిని కట్టి పడేశాయని.. సమాజంలో మంచి కోసం ఇంకా మరిన్ని పాటలు గోపాలకృష్ణ రాయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మంత్రి అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్సీలు వీవీవీ చౌదరి, ఏఎస్ రామకృష్ణ, చైర్మెన్ లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వీరంకి గురుమూర్తి, హజ్ కమిటీ చైర్మెన్ హాజీ హసన్ బాషా, గుమ్మడి గోపాలకృష్ణ, గొట్టిముక్కల రఘురామరాజు నేతలు ఏవీ రమణ, బుచ్చి రాంప్రసాద్, కోమటి జయరాం, వందనాదేవి, కోవెలమూడి రవీంద్ర, పాతర్ల రమేష్, రాజశేఖర్, SP సాహెబ్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News