Breaking News

దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యం..

-ప్రభుత్వం కల్పించే సహకారాన్ని అందిపుచ్చుకోవాలి..
-దివ్యాంగులకు ల్యాబ్‌ టాప్‌లను అందజేసిన కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న సహారాన్ని జీవితంలో ఉన్నత శికరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు.
దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆరుగురు దివ్యాంగ విద్యార్థులకు కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ల్యాబ్‌ టాప్‌లు, వినికిడి యంత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. దివ్యాంగ విద్యార్థులు అవసరమైన ఉపకరాణాలను అందించి విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఆరుగురు డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 35 వేల రూపాయల విలువగల ఆరు ల్యాప్‌ టాప్‌లను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. వీరితో పాటు వినికిడిలోపంగల విద్యార్థికి 3,500 రూపాయల విలువగల వినికిడి యంత్రాని అందజేయడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతుల అవసరాలను గుర్తించి, వారి ఎదుగుదలకు చేయూతనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమగ్ర, సుస్థిర భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి విభిన్న ప్రతిభావంతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ తెలిపారు.
ల్యాప్‌ టాప్‌ పంపిణీ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి. కామరాజు, డిఆర్‌డిఏ పిడి ఏఎన్‌వి నాంచారరావు, వివిధ శాఖల అధికారులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *