Breaking News

శక్తి యాప్‌తో మహిళలకు మరింత భద్రత..

-సైబర్‌ నేరాలకు 1930 టోల్‌ ఫ్రీ తో అడ్డుకట్ట..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని 1930 టోల్‌ ఫ్రీతో సైబర్‌నేరాలకు అడ్డుకట్ట వేసి నేరాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
మహిళల భద్రత కొరకు రూపొందించిన శక్తి యాప్‌, సైబర్‌ నేరాల నివారణకు అందుబాటులోకి తీసుకువచ్చిన 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మహిళల రక్షణ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ శక్తి యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. శక్తి యాప్‌ సహాయంతో మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఒక్క క్లిక్‌తో పోలీస్‌ల సహాయం కోరవచ్చునని మహిళల జోలికొచ్చే వారికి తగిన బుద్ధి చెపేందుకు శక్తి యాప్‌ ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు.
ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ దీనికి భద్రతాపరమైన ఫీచర్లను జోడిరచి రూపొందించిన శక్తి యాప్‌ మహిళలకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ లో వన్‌ టచ్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తమై సంబంధిత ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకుంటారన్నారు. దీనిలో లైవ్‌ ట్రాకింగ్‌ అండ్‌ ఎవిడెన్స్‌ షేరింగ్‌ కాలర్‌ లొకేషన్‌ ద్వారా ఆడియో, వీడియో కంట్రోల్‌ రూమ్‌ కు పంపబడుతుంది. తద్వారా పోలీసు అధికారులు తక్షణమే స్పందిస్తారన్నారు. యాప్‌లో ఫిర్యాదుల నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్ట్‌ చేయడం, అక్రమ కార్యకలాపాల గురించి రిపోర్టు చేయడం, పోలీసు అధికారుల వివరాలు, వారి మొబైల్‌ నంబర్లు, వాట్సాప్‌ గవర్నెన్స్‌, భద్రతతో కూడి ప్రయాణం, అత్యవసర కాంట్రాక్డ్‌ నంబర్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్స్‌ను ఈ యాప్‌లో పొందుపరచడం జరిగిందన్నారు. శక్తి యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకునేలా మహిళలను చైతన్యవంతులు చేయాలని సూచించారు.
సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
సైబర్‌ నేరగాళ్లు అనేక ఆశ చూపి డబ్బులు కోసం వల వేస్తారన్నారు. డిజిటలైజేషన్‌ యుగంలో ఆన్లైన్‌ బ్యాంకింగ్‌ అవసరాలతో పాటు సైబర్‌ మోసాల ముప్పు కూడా పెరిగింది అన్నారు. సైబర్‌ మోసానికి గురైనట్లు భావిస్తే 1930 నెంబర్‌ కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరు బ్యాంక్‌ ఖాతాలో నుంచి అయినా డిజిటల్‌ వాలెట్లు క్రెడిట్‌ డెబిట్‌ కార్డుల ద్వారా మోసపూరితంగా నగదు బదిలీనట్లు తెలిస్తే హెల్ప్‌ లైన్‌ కు ఫిర్యాదు చేయాలన్నారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి, ఏదైనా స్కీం గురించి వివరాలు అడిగిన వెంటనే మోసపోకుండా సైబర్‌ నేరగాళ్ల పన్నాగంగా గుర్తించి తక్షణమే సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసేలా ప్రజలలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ సూచించారు.
పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డిఆర్‌వో యం. లక్ష్మీ నరసింహాం, డిఆర్‌డిఏ పిడి ఎఎన్‌వి నాంచారరావు, సిసిఆర్‌బి సిఐ కెవి కృష్ణ కుమార్‌, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి. జ్వోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *