విపత్తు నివారణ కోసం ములకల లంక గ్రామం మాక్ డ్రిల్

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం / సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు ప్రకృతి వైపరిత్యములకు సంబందించి ప్రజలకు అవగాహన కలిపించుటకు గాను ముందస్తుగా రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్, పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, జంతు పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, ట్రాన్స్ పోర్ట్, విమానయాన విభాగం మొదలగు శాఖలకు సంబందించిన ప్రభుత్వ సిబ్బందితో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యములో సీతానగరం మండలం, ములకల లంక గ్రామం నందు ఏప్రియల్ 22 వ తేదీ ఉదయం 8.30 గంటలకు నిర్వహించబోవు ఫిజికల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సదరు ములకల్లంక గ్రామ ప్రజలు, మీడియా ప్రతినిదులు ఈ కార్యక్రమానికి హాజరుకావలసినదిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *