Breaking News

మరణించిన పెన్షన్ దారులకు భాగస్వామికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

-2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణాలు జరిగిన పురుష పెన్షనర్ల భాగస్వాములకు
-జిల్లా వ్యాప్తంగా ఉన్న 3408
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
01.12.2023 నుండి 31.10.2024 వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల వివరాలు, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేసేందుకు పోర్టల్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

ఇటీవల అమరావతి లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా నవంబర్ తర్వాత మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందనీ తెలియ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ నెల కంటే ముందు మరణించిన వారి పెన్షనర్ల జీవిత భాగస్వామి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరడం జరిగిందన్నారు. ప్రతి వారం నిర్వహించే పిజి ఆర్ఎస్ లో వితంతు, జీవిత భాగస్వామి పెన్షన్ కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అర్హత కలిగిన పెన్షనర్ల జీవిత భాగస్వామి వారికి సమీపంలో ఉన్న సచివాలయం సిబ్బంది సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలియ చేశారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం 1.12.2023 నుంచి 31.10.2024 మధ్య మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి వివరాలు అప్లోడ్ చేయడం కోసం పోర్టల్ అందుబాటులో ఉంచినట్లు తెలియ చేశారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ సమీపంలోని సచివాలయం సిబ్బంది ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. పి జి ఆర్ ఎస్, ఇతర విధానాలలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీలను పరిశీలించి ఆయా అర్జీదారుల ద్వారా దరఖాస్తు చేసుకునేలాగా జిల్లా గ్రామీణ అభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మండలాల వారీగా మరణ పింఛను దారుల వివరాలు 01.12.2023 నుండి 31.10.2024 వరకు

అనపర్తి 156., బిక్కవోలు 165 , చాగల్లు 152 , దేవరపల్లి 163 , గోకవరం  154 ,  గోపాలపురం 165 , కడియం 157 , కోరుకొండ 217 , కొవ్వూరు 127 , కొవ్వూరు అర్బన్ 42 , నల్లజర్ల 176 , నిడదవోలు 142 , నిడదవోలు (పట్టణ) 60 , పెరవలి151 , రాజమండ్రి అర్బన్ 303 , రాజమండ్రి రూరల్ 234 , రాజానగరం 241 ,  రంగంపేట 158 , సీతానగరం 173 ,  తాళ్లపూడి  106 ,  ఉండ్రాజవరం 166

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *