రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి కనపరిచే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం మండలం కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ 390 సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి పారదర్శక విధానం లో ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటు కి రిజర్వేషన్ అనుసరించి స్థలాలు కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 390 ప్లాట్స్ లో వేమగిరి, జేగురుపాడు గ్రామాలకి చెందిన 197 మందికి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. మిగిలిన స్థలాలు కోసం ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు. ఎస్ సి, ఎస్టీ లకి సంబంధించి సైట్స్ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. www.apiic.in వెబ్ సైట్ లో రెండు మూడు రోజులలో పబ్లిక్ డొమైన్ లో సైట్ వివరాలు, ధర, రిజర్వేషన్ వివరాలు తో కూడా సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలియ చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జెడ్ ఎం (ఏపీ ఐఐసి) రమణ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, ఏపీ ట్రాన్స్కో కే. తిలక్ కుమార్, ఏ డీ ప్రదీప్ కుమార్, తహసిల్దార్ దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News