కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరం

-శనివారం ఉదయం అవగాహన కార్యక్రమం
-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెసి ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఈ క్రమంలో ప్రజల్లో, రైతుల్లో, వ్యాపారుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని, రసాయనాలతో మాగ బెట్టిన పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలియ జేయాలన్నారు.

కృత్రిమంగా పండ్లను మాగబె ట్టడం పై రైతులు, వ్యాపారస్తు లు, వినియోగదారులకు విస్తృ తంగా అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. వ్యాపారస్తులు నిషేధిత కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమం గా పళ్ళను మాగ బెట్టితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు సంబంధించి చట్టాలు పై అవగాహన కల్పించడం ముఖ్యం అని తెలిపారు. రసాయనాలతో వ్యాపారస్తులు పండ్ల ను మాగ పెడితే వారి లైసెన్సు లు పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 26 వ తేదీ శనివారం మార్కెట్ యార్డు నందు ఉదయం 9 గంటలకు కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సదస్సులో రైతులు, వ్యా పారస్తులు, వినియోగదారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మామిడి పండ్లు, ఇతర పండ్లు కృత్రిమంగా మాగబెట్టే పద్ధతు లు ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పం డ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టడం చాలా సాధారణమని ఈ పద్ధతి వల్ల పండ్లలో హానికరమైన రసాయనాలు చేరి, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర మైన ప్రభావం చూపిస్తున్నా యన్నారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో మాగ బెట్టిన పండ్లను తింటే, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధు లు, జీర్ణవ్యధులు, మరి యు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ ఈ విషయా న్ని గమనించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి వి. రుక్కయ్య, ఏడి మార్కెటింగ్, ఎం. సునీల్ వినయ్, ఆర్టీవో ఆర్. సురేష్ , జిల్లా ఉద్యాన శాఖ అధికారి, బి. సుజాత కుమారి, జిల్లా పం చాయతీ అధికారి కార్యాల యం ఏవో ఎం జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *