పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్‌)- 2025 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్‌)- 2025 పరీక్షలు పగ డ్బందీగా నిర్వహిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పాలిటెక్నిక్ కామ‌ న్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భం గా చిన్న రాముడు మాట్లాడుతూ ఏప్రిల్ 30 వ తేదీన శనివారం ఉదయం11 గంటల నుండిమధ్యాహ్నం 1 గంట వరకు ప్ర‌వేశ ప‌రీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో 5754 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తుస్తున్నారని తెలిపారు.

పరీక్షా సమయాల్లో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు మరియు భద్రతను అందించడం కోసం మ రియు పోలీసు స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాల బండిల్స్ రవాణా సమయంలో మరియు పరీక్షా కేంద్రాల నుండి పోస్టాఫీసుకు ఆన్సర్ స్క్రిప్ట్ బండిల్స్ రవాణా స మయంలో బందోబస్త్ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి వి భాగం నుండి ఒక సీనియర్ అధికారు లను ఫ్లయింగ్ స్క్వాడ్‌లుగా కేంద్రా నికి పంపడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పారిశుద్ధ్యము మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా
త్రాగునీటి సౌకర్యం కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తాహిసిల్దార్ల ను ఆదేశించారు. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని బస్ స్టేషన్‌ల నుండి సంబంధిత పరీక్షా కేంద్రాలకు తరచుగా బస్సులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వైద్య సహాయం అందించడానికి పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లు మరియు ORS ప్యాకెట్లతో వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాలిటెక్నిక్ కాలేజ్, వి నాగేశ్వరరావు, జిల్లా పాఠశాల విద్యా అధికారి కె. వాసుదేవరావు , జిల్లా పంచాయతీ అధికారి కార్యాల యం ఏవో, ఎం జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *