కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి విజ్ఞాన శిబిరము (సమ్మర్ కాంప్) బాల బాలికలందరూ వేసవి శలవులను ఆనందంగా, ఆహ్లాదకరముగా వినియోగించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం, కొవ్వూరు నందు ది.28-04-2025 నుండి 06-06-2025 వరకు 10 నుండి 15 సంవత్సరముల బాలబాలికలకు అనగా 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకూ చదివే విద్యార్థుల కోసం ఉచిత వేసవి విజ్ఞాన శిబిరము(సమ్మర్ కాంప్) నిర్వహిస్తున్నట్లు గ్రేడ్.1 లైబ్రేరియన్ జి.వి.వి.ఎన్.త్రినాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ వేసవి శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు నేర్పించడం, గ్రంథాలయంలో గల పుస్తకములు చదివించడం, కధలు చెప్పడం, డ్రాయింగ్, సంగీతం, క్రాఫ్ట్స్, డాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వివిధ అంశాలు నేర్పించడం వంటి సృజనాత్మక కార్యక్రమాలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నేర్పించబడును. ఈ వేసవి శిక్షణ శిబిరము ప్రతి రోజూ ఉదయం గం.08-00ల నుండి గం.11-00ల వరకు నిర్వహించబడును.
కావున మీ పిల్లలను ఈ శిబిరము నందు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో పాల్గొని వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెపొందిచుకొనే అవకాశం కల్పించి ప్రోత్సహించవలసినదిగా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పౌర సమాజాన్ని కోరుచున్నాము.
Prajavartha Online Telugu News