Breaking News

ఆయుధం లాంటి కవి లోసారి సుధాకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోసారి సుధాకర్ ఆయుధం లాంటి కవి అని కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్ లోసారి సుధాకర్ నాల్గవసంపుటి ఆయుధం లాంటి మనిషి కవిత్వాన్ని ఆయన ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా బండ్లమాధవరావు వ్యవహరించారు. సభలో ఆవిష్కర్త మాట్లాడుతూ ఈ కవిత్వంలో వస్తువు శిల్పము ఎత్తుగడలు గొప్ప సౌందర్యాన్ని ఇస్తాయని కవిత్వం కవిత్వం గా రాశారని అన్నారు. వర్తమాన కవిత్వాన్ని చూస్తున్నప్పుడు తడియారని కవిత్వంగా కనబడుతుందని అన్నారు. సభలో సమన్వయకర్తగా వ్యవహరించిన పలమనేరు బాలాజీ మాట్లాడుతూ లోసారి కవిత్వం సామాజిక చైతన్యాన్ని స్పృహను కలిగించడమే కాకుండా మరో ప్రపంచం వైపు నడిపిస్తుందని అన్నారు. వర్తమాన కవిత్వంలో అరుదైన కవిగా బహుముఖీయ కవిత్వ ప్రజ్ఞకలిగిన కవిగా మనకు కనిపిస్తారని అన్నారు. కవి మందరపు హైమావతి మాట్లాడుతూ ఈ కవిత్వం లో పలుచోట్ల సుధాకర్ స్రీవాదిగా కనిపిస్తారని అన్నారు. కవిత్వంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన కవిగా కనబడతారని వివరించారు. ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ సుధాకర్ కవిత్వం ఆధునిక కవిత్వంలో కవిత్వ నిర్మాణంతో కూడిన వస్తువును శైలిని కలిగి ఉంటుందని ఇందులోని కవి భావజాలం కవిలోతుల్ని సంచరిస్తుందన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కేంగార మోహన్ మాట్లాడుతూ లోసారి సుధాకర్ కవిత్వంలో మార్క్సిస్టు సౌందర్య శాస్త్రాలు కనిపిస్తాయని లోతైన భావన అరుదైన శిల్ప వైవిధ్యంతో కూడిన కవిత్వం వర్తమాన సమాజానికి అద్దం పడుతుందని అన్నారు. ఈ కవిత్వం నిండా స్త్రీవాదం దళితవాదం మైనార్టీ వాదంతో పాటు మానవతావాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అనేక సామాజిక స్థితులను కవిత్వంగా కళ్ళ ముందు పరిచారని ఈ ఆయుధం లాంటి మనిషి ప్రభుత్వం సాహిత్య చరిత్రలో ముఖ్యంగా కవిత్వలోకంలో అరుదైన పుస్తకమని అన్నారు. డీఎస్పీ తేజేశ్వరరావు మాట్లాడుతూ సుధాకర్ కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అరుదైన వస్తువులతో కవిత్వాన్ని రాయడం ఇందులో ప్రతి కవిత వైవిధ్యంగా ఉండడం ఆనందాన్నిస్తుందని అన్నారు. సభాధ్యక్షులు బండ్ల మాధవరావు మాట్లాడుతూ కవి తన కవిత్వంతో హృదయాన్ని తాకుతారని అటువంటి కవిత్వం ఇటీవల కాలంలో రాలేదని చెప్పవచ్చని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకు ఆధునిక కవిత్వానికి మైనపు బొమ్మలు తడియారం స్వప్నం నా రహస్యమందిరంలో వంటి సంపదలతో వైవిద్యమైన కవిగా అవతరించారని ఈ కవిత్వం వర్తమాన సమాజంలో వైవిధ్యభరితమైనదని అన్నారు. సభ ప్రారంభానికి ముందు ఆన్లైన్లో ప్రముఖ కవి భువనచంద్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే జ్యోతి ప్రజ్వలన కవి సతీమణి ప్రమీల చేశారు. ఈ కార్యక్రమంలో కవులు అనిల్ డ్యని శ్రీశ్రీ విశ్వేశ్వరరావు,కవులు కలిమిశ్రీ, వైష్ణవశ్రీ, కోసూరి రవికుమార్, గుమ్మాసాంబ శివరావు, మంచికంటి, వెన్నావల్లభరావు, తేజేశ్వర రావు, వెంకటేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *