-“కష్టపడితేనే జీవితంలో విజయం”
-“విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి”
-“సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి”
-“ఎ ఎన్ యు తక్షశిల విద్యాకేంద్రం పాఠ్య ప్రణాళిక బాగుంది”
-“విద్యార్థులు లక్ష్యసాధనకై క్రమ శిక్షణతో ముందుకు సాగాలి”
-ఆరు దశాబ్దాల సివిల్ సర్వెంట్ జ్ఞాపకాలు “లైఫ్ ఆఫ్ కర్మయోగి”
-భారతదేశ స్వాతంత్ర్య ముందు,తరువాత మూడు తరాల జీవిత సమగ్ర దృశ్యము“ కర్మయోగి”
-ఎమ్ టి.కృష్ణబాబు,ఐ ఎ ఎస్. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ,హెల్త్ మెడి కల్ &ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి మనిషికి విద్య ఒక బ్రహ్మాస్త్రం అనీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని , విద్యార్థులు కష్టపడితేనే జీవితంలో విజయం వరిస్తుందని రాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు పిలుపునిచ్చారు.
బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డా. బాలమోహన్ దాస్ ఆడిటోరియంలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏం గోపాలకృష్ణ రచించిన “లైఫ్ ఆఫ్ కర్మయోగి – మెమరీస్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్” పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలని విద్యార్థులు వారి సమయాన్ని సోషల్ మీడియాలో దుర్వినియోగం చేసుకోకుండా తమ భవిష్య ప్రణాళికలపై దృష్టి సారించాలని ఆయన హితోపదేశం చేశారు. ఎ ఎన్ యు తక్షశిల విద్యాకేంద్రం పాఠ్యప్రణాళిక పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి లక్ష్యసాధనకై క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు. ఆరు దశాబ్దాల విలువలతో కూడిన నైతిక ప్రయాణ సివిల్ సర్వెంట్ ఎమ్ గోపాలకృష్ణ జ్ఞాపకాలే లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నేటితరం విద్యార్థులకు మార్గదర్శకమని ఆయన వివరించారు. భారతదేశ స్వాతంత్ర్యం ముందు, తరువాత మూడు తరాల సమగ్ర జీవిత దృశ్యము కర్మయోగి అని టి కృష్ణబాబు విపులీకరించారు.
పుస్తక రచయిత విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఎమ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా తన సర్వీసులో ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అధికారికా అస్సాం రాష్ట్రంలో మొదటి పోస్టింగ్ లో ఎదురైన అనుభవాలు, అనేక రాష్ట్రాలలో జ్ఞాపకాలను విద్యార్థినీ విద్యార్థులతో పంచుకున్నారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలు, విలువలతో కూడిన విద్యాభ్యాసం, కష్టపడే తత్వం , క్రమశిక్షణ, విద్య పట్ల విద్యా వ్యవస్థ పట్ల సముచిత భావం, గురువులపై గౌరవం వంటి లక్షణాలు ప్రతీ విద్యార్థి అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తక్షశిల ఐఏఎస్ అకాడమీ చీఫ్ పేట్రన్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.ఎన్.విష్ణు మాట్లాడుతూ, ఈ పుస్తకం నిజమైన సివిల్ సర్వీస్ స్పూర్తికి నిదర్శనమని కొనియాడారు. నైతిక విలువలతో కూడిన పరిపాలన తరం తరాలకు స్ఫూర్తిగా నిలవాలంటే ఇలాంటి రచనలు అవసరమని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ కె. రత్న శీల మణి మాట్లాడుతూ ప్రజా పాలనలో ఇటువంటి అనుభవాత్మక రచనలు ముఖ్యమైన భాగంగా మారాలన్నారు. విద్యార్థులు పరిపాలన యొక్క వాస్తవ అనుభవాలను తెలుసుకునేలా చేయాలని సూచించారు. యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సురేశ్ కుమార్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఎస్.ఎన్. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకంలోని పారదర్శకత, నిజాయితీ, భావోద్వేగాల పరిమితి, భవిష్యత్తు పాలనాధికారులకు ఇది ఎలా దిశానిర్దేశం చేస్తుందన్న అంశాలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఒక పుస్తకం చర్చగా మాత్రమే కాకుండా, ప్రజాసేవా స్ఫూర్తిని కొత్త తరం లోకి బలంగా బోదించే ఒక వినూత్న వేదికగా నిలిచింది.
కార్యక్రమంలో సీనియర్ ఉద్యోగులు, విద్యావేత్తలు, సివిల్ సర్వీసెస్ ఆశావహులు , విద్యార్దులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News