Breaking News

ప్రధాని పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజధాని అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి మే 2 వ తేది అమరావతి రానున్న నేపధ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాధం , జీయంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ప్రధాన వేదిక , పబ్లిక్ , వీవీఐపీ , వీఐపీ గ్యాలరీల వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కే. శ్రీనివాస రావు, జెడ్పీ సిఇఓ జ్యోతిబసు , జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి , రెవెన్యూ , పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *