Breaking News

ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రైతులు గత ఐదేళ్లుగా సాగించిన ధర్మ పోరాటంలో విజయం సాదించారని, రైతుల అలుపు లేకుండా చేసిన పోరాటానికి శిరస్సు మంచి నమస్కరిస్తునన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాన్ కొనియాడారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ది పనుల పున: ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ది పనుల పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు అంతా తన కుటుంబీకులే నని, వారి సంక్షేమానికి, అభ్యున్నతికి దేశ ప్రధాన నరేంద్ర మోదీ అలుపెరుగని కృషి చేస్తున్నారని కొనియాడారు. భవాని మాత మోదీని మరింత శక్తిమంతుణ్ణి చేయాలని ఆయన ఆకాంక్షించారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఎంతో దు:ఖంలో ఉండి కూడా అమరావతి రైతుల త్యాగాలను ఆయన గుర్తించబట్టే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. అమరావతి అభివృద్దికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోది ఎంతగానో సహకరిస్తున్నారంటూ ఆయనకు ధన్యవాదములు తెలిపారు .

గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసిందన్నారు. గత ఐదేళ్లలో అమరావతి రైతులు ఎంతో నలిగిపోయారని, అమరావతి మహిళా రైతులు ఎంతో పోరాడారు లాఠీదెబ్బలు, ముళ్లకంచెల మధ్య ఇబ్బందిపడ్డారన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మరచిపోమని, వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రపంచ స్థాయి తొలి ఐదు నగరాల్లో అమరావతి రాజధాని నిలిచేలా విధంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్దికి రైతులు తమ విలువైన భూములను ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి భవిష్యత్తును కూడా ఇచ్చారన్నారు. వారి ఆశలకు అనుగుణంగా అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవిర్భవిస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో మన విద్యార్థులు ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లాల్సిన పని ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *