Breaking News

రాజధాని పనుల పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో రాజధాని పనుల పునఃనిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని టీజీ భరత్ తెలిపారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *