దీక్షకు, సహనానికి ప్రతిరూపం.. భగీరథ మహర్షి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక కల్యాణం కోసం కఠోర తపస్సు చేసి పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహర్షి అపర భగీరథుడని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులో ఆదివారం జరిగిన భగీరథ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన.. ఆ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. భగీరథుడు ఒక్క సగర ప్రజలకే కాదు.. యావత్ హైందవ ప్రజానీకానికి ఆరాధ్యుడు, పూజనీయుడని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని కీర్తించారు. మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాణికోటి కష్టాలు తీర్చిన మహర్షి భగీరథుడని వ్యాఖ్యానించారు. కనుకనే ఎంత కష్టాన్ని లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి తాగు నీరిచ్చే విధంగా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు తాడిశెట్టి నాగేశ్వరరావు, ఆవాల బుజ్జి, శ్రీనివాసరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *