Breaking News

వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చెయ్యండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చెయ్యాలని దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రలో వెళ్ళిన కార్పొరేటర్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రని కోరారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శుక్రవారం సాయంత్రం కమిషనర్ ని కలిశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూరు, మదురై, నాగర్ కోయిల్, తిరువనంతపురం, కొచ్చి నగరపాలక సంస్థలలో పరిశీలించిన వినూత్న ప్రాజెక్టులను కమిషనర్ ధ్యాన చంద్రకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఆయా నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర అవగాహన పొందిన విషయాలను కమిషనర్‌కు వివరించారు. నగర అభివృద్ధికి వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చేయడానికి సిఫారసులు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మొహమ్మద్ ఇర్ఫాన్, నిర్మల కుమారి, మల్లీశ్వరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *