Breaking News

నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన చంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, పట్టణ ప్రణాళిక శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలు, రహదారి కిక్కిరిసిన ప్రాంతాలు, అవరోధాలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఏడీసీపీ) ప్రసన్న కుమార్, సీఐ ఉమా మహేశ్వరరావు, సీఐ సత్య రమేష్, వీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డీసీపీ చంద్ర బోస్, ఏసీపీ మోహన్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *