-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గుంటతిప్ప డ్రైన్, ఆటోనగర్, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుండెతిప్ప డ్రైన్లో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించి పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, రానున్నది వర్షాకాలము అయినందున ఎప్పటికప్పుడు డిసీల్టింగ్ పనులు పూర్తిచేసి వర్షపునీరు వెనక్కి రాకుండా కాలువలోనే ప్రవాహం అయ్యేటట్టు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహానికి అడ్డుపడే ఆక్రమణలను తొలగించాలని, నగరంలో అక్రమణాలను పరిశీలించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్ లో గల అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. ఆహార నాణ్యత పారిశుద్ధ్య నిర్వహణ త్రాగునీటి సరఫరా వంటి అంశాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమీ, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరిండెంట్ ఇంజనీర్ (వర్క్స్ )పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News