పెట్రోల్ బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా శనివారం సెంట్రల్ జైల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు వినియోగదారుల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శివబాలాజీ, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ పెట్రోలు బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ వినియోగదారుడు పెట్రోలు నాణ్యత, పరిమాణం సరిచూసుకోవాలని సూచించారు. ఫిర్యాదులేమైనా ఉంటే 1967 కు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. జి.అనంతరావు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతీ పెట్రోలు బంకులో మంచి నీరు, మరుగు దొడ్లు, గాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి ఉచితంగా అందించాలని సూచించారు. ఫిర్యాదులు ఉంటే 1915 కు గానీ కంపెనీ సేల్స్ ఆఫీసర్, సివిల్ సప్లైస్ అధికారి, లీగల్ మెట్రాలజీ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం అధికారులు బంకులో తనిఖీలు నిర్వహించారు. బంకు సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *