Breaking News

కిలోకు రూ.500 ధరకు కోకో గింజల కొనుగోళ్లు

-ఇంకా రైతులు వద్ద ఉన్న వెయ్యి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన
-మంత్రి కందుల దుర్గేష్
-క్యాంపు కార్యాలయంలో కోకో రైతులతో జరిగిన సమావేశంలో కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని ట్రేడర్లకు మంత్రి దుర్గేష్ ఆదేశం
-కోకో రైతుల దగ్గర నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచన
-కోకో రైతులను ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కోకో గింజలను కిలోకు రూ.500 ధరకు కొనుగోలు చేసేందుకు మాండలీజ్ సంస్థ అంగీకరించిందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాము పండించిన కోకో పంట ఉత్పత్తులకు ధర లేకపోవడంతో ఆందోళనకు దిగిన రైతులకు భరోసానిస్తూ శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ అధికారులు, ట్రేడర్లు, రైతులతో కోకో కొనుగోళ్లు,గిట్టుబాటు ధరలపై చర్చించారు. రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన కోకో గింజలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు, కంపెనీలకు మధ్య అనుకూల వాతావరణం ఉండాలని, కంపెనీలు రైతు పక్షపాతిగా వ్యవహరించాలని సూచించారు. కోకో రైతులు సాగు చేసిన చివరి గింజ వరకు కొనుగోలు జరపాలని ఈ సందర్భంగా ఆదేశించారు.కూటమి ప్రభుత్వం కోకో రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోకో రైతులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి దుర్గేష్ హామీతో కోకో రైతులు ఆందోళన విరమించారు.

అధికారులు వివరాలు తెలియ చేస్తూ జిల్లాలో 2520 హెక్టార్ల దిగుబడి విస్తీర్ణం 2353 మంది రైతులు సుమారు 2000 మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించడం జరిగిందన్నారు. అందులో సుమారు 1000 మెట్రిక్ టన్నులు (60% మార్కెట్ వాటా) కొనుగోళ్లు పూర్తి చెయ్యడం జరిగిందనీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి రైతుల నుంచి కొనుగోళ్లు చెయ్యడం జరుగుతుందని వెల్లడించారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఆర్డీవో రాణి సుస్మిత, ఏపీ ఎంఐపీ పిడి ఏ. దుర్గేష్, హార్టికల్చర్ అధికారి బి సుజాత, మాండలీజ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జె.విజయ్ కుమార్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ లు కేఏ సాయి స్వరూప్, కె నవీన్, కోకో రైతులు బొల్లా వెంకట సుబ్బారావు (కొమ్ముగూడెం), ఉప్పల కాసి (కోరుమామిడి), ఏడుపుగంటి శ్రీనివాస్ (చిన్నాయగూడెం), పాతూరి నాగేశ్వరరావు (కోరుమామిడి), ⁠యలమటి భాస్కర్ -(కురుకూరు) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *