Breaking News

సుజనా చౌదరి ను పరామర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ లు పరామర్శించారు. లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నేత యలమంచిలి శ్రీనివాస్ పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *