Breaking News

సుజనా చౌదరి ను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మంగళవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన సుజనా చౌదరి కు వైద్యులు సర్జరీ చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. విషయం తెలుసుకున్న సామినేని ఉదయభాను జనసేన నేతలతో కలిసి హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఉదయభాను ఆకాంక్షించారు. జనసేన నేతలు సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, గంజి పవన్, సమతం సత్తిబాబు, 99 టీవీ సీ. ఈ. ఓ కోడూరు గణేష్, జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు తదితరులు ఉదయభానుతో కలిసి పరామర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *