Breaking News

నగర ప్రజలకు సకాలంలో ఎన్టీఆర్ భరోసా- పెన్షన్ల పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మి షా తో కలిసి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం సత్యనారాయణపురం పురుషోత్తమ వీధి, పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

జూన్ 1, 2025 ఆదివారం అయినందున, ప్రజలకు ఎన్టీఆర్ భరోసా అందటంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదు అన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగా అనగా మే 31, 2025 న లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు అధికారులు. సత్యనారాయణపురం పురుషోత్తం వీధి లో గల పెన్షన్ లబ్ధిదారుల, ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి, వారికి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పెన్షన్ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి కచ్చితంగా పెన్షన్ అందించాలని అన్నారు. సాయంత్రం 4 గంటల వరకు నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 20,231 పెన్షన్ లకు 18,518, సర్కిల్ 2 పరిధిలో ఉన్న 25,542 గాను 23,195, సర్కిల్ 3 పరిధిలో ఉన్న 20,233 గాను 18,378 పెన్షన్లు పంపిణీ చేశారని, మిగిలినవి కూడా సత్వరమే పూర్తి చేసి పింఛన్ లబ్ధిదారులకు సత్వరమే అందిస్తారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *