-రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) మందికి పెన్షన్ పంపిణీ
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా 2,33,924 మందికి రూ.102 కోట్ల 19 లక్షల 22 వేల ను ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ లో భాగంగా రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) రూ.95,25,50,500 పంపిణీ చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.
శనివారం రాజమండ్రి రూరల్ పిడింగోయి గ్రామపంచాయతీ నాలుగో వార్డ్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక 4 వ వార్డు కోనేరు పేట కి చెందిన చీరా రమణమ్మ కు రూ.4000 వేలు వృద్యాప పెన్షన్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పూర్తిగా మంచానికే పరిమితం అయిన రమణమ్మ కు వైద్య అధికారులు ద్వారా తగిన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్థరైటిస్ తో బాధపడుతూ దీర్ఘకాలికంగా మంచానికే పరిమితం అవ్వడం జరిగిందనీ కుటుంబ సభ్యులు కలెక్టర్ దృష్టి కి తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా పై విధానం స్పందించిన కలెక్టర్ తగిన వైద్య పరీక్షలు చేయాలని, తదుపరి మంచానికి పరిమితం అయిన రమణమ్మ కు పెన్షన్ పెంపు పై తగిన ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి ఎంపీడీవో కే ఎస్ ఆర్మ్ స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News