రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి Dr కె. వెంకటేశ్వరావు వైద్య అధికారులు, సిబ్బందితో స్థానిక డీ ఎమ్ హెచ్ వో కార్యాలయము యోగాంధ్ర కార్యక్రమం పై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా అందర్నీ భాగస్వామ్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక డ్రైవ్ లో తేదీ 28/5/2025 రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ ట్రంక్ రోడ్డు యందు నిర్వహించిన శిక్షణకార్యక్రమానికి సుమారు 1000 మంది అంగనవాడి టీచర్లు మరియు ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ స్టాఫ్ హాజరైనారు మరియు తేదీ 30/5/2025 నిన్న జరిగిన ఆర్ట్స్ కాలేజ్ ట్రంక్ రోడ్డు నందు నిర్వహించిన శిక్షణ కు విచ్చేసిన జిల్లా నుంచి డాక్టర్స్ మరియు ఆరోగ్య కార్యకర్తలు ,కమ్యూనిటీ ఆఫీసర్స్ /MLHPs మరియు ఆశాలు మొత్తం 1500 సుమారుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అలాగే తేదీ 5/6/2025 గురువారం ఆర్ట్స్ కాలేజ్ ట్రంకు రోడ్డు యందు నిర్వహించే యోగాంధ్ర శిక్షణా కార్యక్రమానికి జిల్లా హెల్త్ స్టాఫ్ అందరు ముఖ్యం గా ANMs, Ashas హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేసారు.
Prajavartha Online Telugu News