“ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr కె. వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈరోజు “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31” సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పొగాకు వలన అనేక అనర్ధాలు ఉన్నాయని ధూమపానం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరియు స్కూలు పరిసరాల ప్రాంతాల్లో పొగాకు పదార్థాలు ( సిగరెట్లు బీడీలు గుట్కాలు, పాన్ పరక్ )అమ్మకం నిషేధం అని, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవించటం నేరమని తెలియజేశారు. పొగాకు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా RBSK (NCD/RBSK) ప్రోగ్రాం ఆఫీసర్ హరిచంద్ర ప్రసాద్ గారు, Dy DEMO సత్య కుమార్ గారు మరియు ఎపిడెమాలజిస్ట్ సుధీర్ బాబు సైకాలజిస్ట్ రాజు,సోషల్ వర్కర్ అర్జున్ రావు మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *