తిరువూరు న‌గ‌ర పంచాయ‌తీని అభివృద్ది దిశ‌గా న‌డిపిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-త‌క్ష‌ణం తాగునీరు, నగర పారిశుద్ధ్యం, రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యల ప‌రిష్కారానికి కృషి
-ప్రశాంతంగా ముగిసిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక
-చైర్ ప‌ర్స‌న్ గా ఎన్నికైన 1వ వార్డ్ కౌన్సిల‌ర్ కె.నిర్మ‌ల‌
-చైర్ ప‌ర్స‌న్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి
-ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన నూత‌న చైర్ ప‌ర్స‌న్ కె.నిర్మ‌ల‌

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త నాలుగేళ్లుగా నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా వైసిపి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. త‌క్ష‌ణం తిరువూరు పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక బ‌ద్ధంగా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది ప‌నులు మొద‌లు పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. తిరువూరు న‌గ‌ర పంచాయ‌తీ కార్యాల‌యంలో జ‌రిగిన చైర్మన్ ఎన్నిక సోమ‌వారం ప్ర‌శాంతంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ కె.నిర్మల కు ఎమ్మెల్యే ఓటుతో ప‌ది మంది కౌన్సిల‌ర్లు మ‌ద్దుతు ప‌లికారు. దీంతో కె.నిర్మ‌ల న‌గ‌ర పంచాయ‌తీ ఛైర్ ప‌ర్స‌న్ గా ఎన్నిక కావ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా న‌గ‌ర పంచాయ‌తీ కార్యాల‌యానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఎన్డీయే కూట‌మి నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చైర్ ప‌ర్స‌న్ గా ఎన్నికైన కె.నిర్మ‌ల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు శాలువాతో స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌గ‌ర పంచాయ‌తీ అభివృద్ధి కాంకిస్తూ టిడిపిలో చేరిన కౌన్సిల‌ర్ల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ తిరువూరు లో న‌గ‌ర పంచాయ‌తీ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగింది. ఈ ఎన్నికకు ముఖ్య కార‌ణం గ‌త నాలుగేళ్లుగా న‌గ‌ర పంచాయ‌తీలో కౌన్సిల‌ర్లు ఎలాంటి అభివృద్ధి చూడ‌క‌పోవ‌ట‌మ‌న్నారు. వైసిపి ప్ర‌భుత్వం తిరువూరు అభివృద్ధి పై నిర్ల‌క్ష్య దోర‌ణి వ‌హించింద‌న్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో అభివృద్ది చేసుకోవాల‌నే ఉద్దేశ్యంతో కొంత‌మంది కౌన్సిల‌ర్లు టిడిపిలో చేర‌టం జ‌రిగింద‌న్నారు.

విజయవాడకు చెందిన వైసిపి గుండాలు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రయత్నించగా తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటుతో వెను తిరిగటం జ‌రిగింద‌న్నారు. వైసీపీ నాయకులు కౌన్సిలర్లను వారి కుటుంబాలకు దూరం చేసి క్యాంపు రాజకీయాలు నడిపటం జ‌రిగింద‌న్నారు.తాము క్యాంపు రాజకీయాలు నడపలేదని, టిడిపి కౌన్సిల‌ర్లు తిరువూరులోనే స్వేచ్ఛ‌గా కుటుంబ స‌భ్యుల‌తో వారి నివాసాల్లోనే వున్నార‌ని తెలిపారు. న‌గ‌ర పంచాయ‌తీ చైర్ ప‌ర్స‌న్ గా కె.నిర్మ‌ల ఎన్నిక కావ‌టంతో ఇక నుంచి తిరువూరు ప‌ట్ట‌ణం అభివృద్ది దిశ‌గా ప‌య‌నిస్తుంద‌న్నారు.

ప‌ట్ట‌ణంలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లైన‌ తాగునీరు , నగర పారిశుద్ధ్యం, రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ స‌మ‌స్య‌ల‌ను ఆరు నెలల్లో పరిష్కరించే విధంగా ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తామ‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తో న‌గ‌ర పంచాయ‌తీ అభివృద్దికి స‌హ‌కారం అందించి అభివృద్దిలో మొద‌టి స్థానంలో నిలిచేలా కృషి చేస్తాన‌ని తెలిపారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలకు మీడియాకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ గ‌త 20 రోజులుగా కొంత‌మంది తిరువూరులో అల‌జ‌డి సృష్టించి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యారన్నారు.తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలోని టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆ అరాచ‌క శ‌క్తుల్ని విజ‌య‌వంతంగా నియంత్రించార‌ని కొనియాడారు. ఎంతో ప్ర‌శాంతంగా న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక పూర్తి చేసుకోవ‌టం జ‌రిగింద‌న్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ నాయ‌క‌త్వంలో తిరువూరు న‌గ‌ర పంచాయ‌తీకి కృషి చేస్తామ‌న్నారు.వ‌ర్ష కాలం రానున్న నేప‌థ్యంలో ఎక్క‌డ మురుగు నీరు నిల్వ వుండ‌కుండా, దోమ‌లు చేర‌కుండా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే కార్య‌చ‌ర‌ణ త‌యారు చేసి త‌క్ష‌ణం అమ‌లు జ‌రిగే విధంగా చూస్తామ‌న్నారు. గ‌త 20 రోజులుగా రాజ‌కీయంగా ఎన్ని ఒడిదుడుకులు వున్నా స‌రే చాలా ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన పోలీస్ శాఖ‌కు,మీడియాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అనంత‌రం నూత‌న చైర్ ప‌ర్స‌న్ కె.నిర్మ‌ల మాట్లాడుతూ త‌న‌కి ఈ అవ‌కాశం క‌ల్పించిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. న‌గ‌ర పంచాయ‌తీ అభివృద్దికి త‌న వంతు కృషి చేసి ప్ర‌జ‌లు,ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల న‌మ్మ‌కాన్ని వమ్ము కాకుండా కృషి చేస్తాన‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ షేక్ అబ్దుల్ హుస్సెన్, కౌన్సిల‌ర్లు నాళ్ల సురేంద్ర‌, జి.స‌త్య‌వ‌తి, దుర్గరావు, ప‌ర‌సా స‌త్య‌నారాయ‌ణ‌, సుంద‌ర్ కుమార్, శేఖ‌ర్ బాబు, నీలిమ‌, క‌స్తూరి బాయి, జిల్లా తెలుగు రైతు సంఘం అధ్య‌క్షులు చెరుకూరి రాజేశ్వ‌రరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువ‌త అధికార ప్ర‌తినిధి మాద‌ల హరిచ‌ర‌ణ్ (కిట్టు), తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మోదుగు వెంక‌టేశ్వ‌ర‌రావు, స్టేట్ బిసి సెల్ నాయ‌కులు కందిమ‌ళ్ల శేష‌గిరిరావు, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు సంకురాత్రి జ‌నార్ధ‌న్ రావు, తాళ్లూరి రామారావు, బిజెపి నాయ‌కులు నంబూరి శ్రీనివాస‌రావు, తోట‌భ‌వానీ, జ‌న‌సేన నాయ‌కులు ఉయ్యూరు జ‌య‌ప్ర‌కాష్ ల‌తో పాటు త‌దితరులు పాల్గొన్నారు. ,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *