స‌త్య‌నారాయ‌ణ పురం పోలీస్ స్టేష‌న్ నూత‌న భ‌వ‌నం ప్రారంభం

-రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ విభాగంలో ఆద‌ర్శ‌వంతంగా త‌యారు కానుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్
-ముఖ్యఅతిథులు హాజ‌రైన హోం మంత్రి అనిత‌, డిజిపి హ‌రీష్ కుమార్ గుప్తా, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా
-నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన ప్ర‌జాప్ర‌తినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు
-ఎంపికి స్వాగ‌తం ప‌లికిన ఎ.డి.సి.పి గుణ్ణం రామ‌కృష్ణ‌
-హోం మంత్రి అనిత‌కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోనే పోలీస్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా ఆద‌ర్శ‌వంతమైన జిల్లాగా త‌యారు కానుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. స‌త్య‌నారాయ‌ణ పురంలోని ముత్యాలంపాడు స్ట్రీట్, జి.ఎస్.రాజు రోడ్ లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సత్యనారాయణపురం మోడల్ పోలీసు స్టేషన్ భవనం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా పోలీస్ స్టేష‌న్ ప్రాంగ‌ణంలో ఎంపి కేశినేని శిన‌వాథ్ పూల‌మొక్క నాటి నీళ్లు పోశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ కి ఎ.డి.సి.పి గుణ్ణం రామ‌కృష్ణ స్వాగ‌తం ప‌ల‌క‌గా. అనంత‌రం విచ్చేసిన హోం మంత్రి అనితకి ఎంపి కేశినేని శివ‌నాథ్ పుష్ప‌గుచ్ఛం అందించి స్వాగ‌తం ప‌లికారు. పోలీస్ స్టేష‌న్ భ‌వ‌నాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించ‌గా, ఈ పోలీస్ స్టేష‌న్ లోని అధికారుల రూమ్లు, సెంట్రీ, రిసెప్షన్, మహిళా హెల్ప్ డెస్క్ లతోపాటు సి.డి.ఆర్.అనాలసిస్, సైబర్ క్రైమ్, సి.సి.టి.ఎన్.ఎస్., ఎల్.హెచ్.ఏం.ఎస్ , ఫెసియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, మొదలగు విభాగాలను ఎంపి కేశినేని శివనాథ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుల‌తో క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రత ల పరిరక్షణ కోసం సిసి కెమెరాలు, డ్రోన్స్, పోలీస్ స్టేషన్ ఆధునీకరణకు సహరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు, హోం మినిస్టర్ అనిత ఆధ్వర్యంలో రాబోయే రెండు మూడు ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ మోడరన్ పోలీస్ స్టేషన్ గా త‌యారు అవుతుందన్నారు, పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు నేతృత్వంలో కార్పొరేట్ కార్యాలయానికి దీటుగా సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందని కొనియాడారు. ఈ పోలీస్ స్టేష‌న్ లో ఎవ‌రైనా సంత‌కం చేయాల్సివ‌స్తే…సంత‌కం కాకుండా థంబ్ ఇంప్రెష‌న్ వేసి వెళ్లిపోయే విధంగా బ‌యో మెట్రిక్ సిస్ట‌మ్ ఏర్పాటు చేయ‌టం బాగుందన్నారు.ఇలాంటి మోడ‌ర‌నైజేష‌న్ రాష్ట్ర వ్యాప్తంగ జ‌ర‌గాలని ఆకాంక్షించారు.

ఇప్ప‌టికే జిల్లాలో జ‌గ్గ‌య్య‌పేట‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని… అలాగే నందిగామ లో 80శాతం సీసీ కెమెరాలు నియోజ‌క‌వ‌ర్గం అంతా ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందన్నారు. . ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం పై భారం ప‌డ‌కుండా దాత‌లు ముందు వ‌చ్చి పోలీస్ స్టేష‌న్స్ ఆధునీక‌ర‌ణ‌కు, సీసీ కెమెరాల ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., ఎ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్ ల‌తో పాటు ఇత‌ర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *