2025-26 వార్షిక క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ

-వ్యవసాయ రంగంలో 1,36,618 మంది రైతులకి రూ.820 కోట్ల మేర ఆర్థిక భరోసా
-పీఎం సూర్యఘర్ యూనిట్స్ గ్రౌండింగ్ కోసం రుణాలు అందించాలి
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాధాన్యత రంగాల, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహం అందించడం ద్వారా సమగ్ర అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు పేర్కొన్నారు.

స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం  బ్యాంకర్ల తో 2025-26 సంవత్సర వార్షిక ప్రణాళిక, నాల్గోవ , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం కు జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించారు

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, జిల్లా సంప్రదింపుల సంఘం (కన్సల్టేటివ్ కమిటీ), జిల్లా స్థాయి సమీక్ష సంఘం (రివ్యూ కమిటీ) సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి గత ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వివిధ పథకాలలో, బ్యాంకు సంబంధిత కార్యకలాపాలలో సాధించిన పురోగతి గురించి సమీక్ష జరపడం జరిగిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యానికి మించి 120 శాతం మేర కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు కూడా లక్ష్యాన్ని మించి 113% మేర కేటాయింపులు జరిగాయని మొత్తంగా 2023 – 24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లాలో అధిక ప్రగతి సాధించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.

2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1,36,618 మంది రైతులకు 820 కోట్ల రూపాయల మేర రుణాలు అందించాలన్నది లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ముద్ర రుణాలు కింద రూ.863 కోట్లను, పశుసంవర్ధక రంగానికి రూ.269 కోట్లను రుణంగా అందించనున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేకూర్పు సాధించడం లో రియల్ టైమ్ విధానం లో వారు జీవనోపాధి కల్పన కోసం ఉపయుక్తం కలుగ చేసే రంగాలలో ఆర్థిక చేకూర్పు సాధించడం కోసం సర్వే నిర్వహించి, ఆమేరకు బ్యాంకర్ల కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు అధికారులు తెలియ చేయడం జరిగింది.

పీఎం సూర్యఘర్ యూనిట్స్ గ్రౌండింగ్ కోసం రుణాలు అందించడం ద్వారా సోలార్ యూనిట్స్ గ్రౌండింగ్ సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. అందులో భాగంగా సామాజిక స్థితి ఆధారంగా సబ్సిడీ పొందే అవకాశం ఉన్నదృష్ట్యా రుణాలు ఇవ్వడం బ్యాంకర్ల చొరవ చూపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాలలో ఇదొకటి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ హెడ్ (యూనియన్ బ్యాంక్) ఏ. మనోజ్, నాబార్డ్ డిడిఎమ్ చక్రధర్ రావూరి,  ఎల్ డి ఎమ్  డివి ప్రసాద్ , ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *