రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి ప్రమాదాలు నివారించేందుకు సంబంధించి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, వాటిని ఆచరణలో పెట్టడానికి తగిన ప్రతిపాదనలతో రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి అధ్వర్యంలో రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని నివారించే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు తగిన కారణాలు పూర్తి స్థాయిలో విశ్లేషణ చెయ్యాల్సి అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు నివారించేందుకు సంబంధించి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టే సందర్భంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతానికి 500 మీటర్ల దూరం నుంచి సూచిక లు , తగిన డైవర్షన్ పెట్టడం, వేగ నియంత్రణ కోసం బోర్డులు ప్రదర్శన చెయ్యాలి ఉందన్నారు. జాతీయ రహదారి పై ఎక్కువ ప్రమాదాలు జరగకుండా తగిన లైటింగ్ వ్యవస్థ, బ్లింకర్స్ ఏర్పాటు చేసి చోదకులను అప్రమత్తం చెయ్యడం ముఖ్యం అన్నారు. సైన్ బోర్డులతో పాటు డైవర్షన్ పెట్టడం వలన వేగ నియంత్రణ ప్రమాద నివారణ సాధ్యం అవుతుందని తెలిపారు.
ఎస్పీ డి నరసింహా కిషోర్ మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నల్లజర్ల పరిధిలో అత్యంత ప్రమాద ఘటన చోటు చేసుకునే ప్రదేశంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో జరిగిన ప్రతి ఒక్క ప్రమాద ఘటన పై శాఖల వారి విశ్లేషణ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అప్పుడే భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, పోలీసు, ఎన్ హెచ్, వైద్య ఆరోగ్య, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News