ఆరోగ్యమే మహాభాగ్యం – ఆహారమే ఔషధం…

-డి ఆర్వో టి. సీతారామ్మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ శరీరం ఎక్కువ శ్రమిస్తే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుందని, శ్రమకు తగ్గ యోగ సాధన వలన శరీరం త్వరగా అలసిపోకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాంట్ ట్రంక్ రోడ్డు మార్గంలో 18 వ రోజు యోగంధ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ ప్రతినిత్యం వేకువ జామన యోగ సాధన చేసే వారి శరీరం పగటి వేళల్లో ఎంత శ్రమించినప్పటికీ శరీరం అలసిపోదని, తద్వారా ఎక్కువ పని గంటలు పని చేయుటకు వీలవుతుందని ఆయన అన్నారు. వేద తత్వశాస్త్రంలోని ఆరు వ్యవస్థలలో యోగా ఒకటి. “యోగ పితామహుడు” అని సరిగ్గా పిలువబడే మహర్షి పతంజలి తన “యోగ సూత్రాలు” (సూక్ష్మ సూత్రాలు)లో యోగా యొక్క వివిధ అంశాలను క్రమపద్ధతిలో సంకలనం చేసి, మెరుగుపరిచారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి ఫలితంగా , జూన్ 21ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దాని తీర్మానంలో, “జీవితంలోని అన్ని అంశాల మధ్య సమతుల్యతను సాధించడమే కాకుండా, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు యోగా సమగ్ర విధానాన్ని అందిస్తుంది” అని UNGA ఆమోదించింది.

జూన్ 21వ తేదీన విశాఖపట్నం నందు నిర్వహించు అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా తరఫున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ, ఆరోగ్యం మహాభాగ్యం.. ఆహారం పరమ ఔషధం అన్ననానుడి మరువ రాదన్నారు. పరిమితి రీతిలో ఆహారం తీసుకోవడం కూడా యోగా సాధన కిందకే వస్తుందన్నారు. యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా సాధన చేయాలని కోరారు.

యోగా సాధన కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి. తిలక్ కుమార్, ఆయుష్ వైద్యులు డాక్టర్ కె.సీహెచ్. రమేష్,  ఆయుష్ నోడల్ అధికారి పి. కేజియా, వైద్యాధికారులు , బ్రహ్మ కుమారి సిస్టర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *