Breaking News

వైద్యుల సేవలు అమూల్యమైనవి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
తమ ముందుకు ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించి, స్వస్థత కలిగించేందుకు ప్రతి వైద్యుడు ఎంతో తపిస్తారు. క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి బల్లపై చిన్నపాటి యుద్ధమే చేస్తారు. వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజలకు వైద్యులంటే ఎనలేని గౌరవమర్యాదలుంటాయి. మన సంస్కృతి… వైద్యుడిని మరో భగవంతుడిగా చూడటం నేర్పించింది. వైద్యులు వృత్తిపరంగా పట్టణాలు, నగరాలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఉన్నా- సామాజిక సేవా దృక్పథంతో మూరుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలనూ సందర్శిస్తూ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *