Breaking News

ఐక్వతతో ముందుకు సాగుదాం… స్త్రీల సంక్షేమం కొరకు పాటుపడదాం… : ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌


తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో… స్త్రీలకు రక్షణ లేని స్వాతంత్య్రయం స్వాతంత్య్రయం కానే కాదని స్త్రీలకు పూర్తిస్థాయిలో రక్షణ హక్కుల పరిరక్షణ కల్పించిన రోజే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా పరిగణించాలని గాంధీ దేశం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ అన్నారు. సోమవారం తెనాలి ఆటోనగర్‌ నుండి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు 1948 జనవరి 30వ తేదీన గాంధీ మహాత్ముడుని గాడ్సే హత్యచేసిన రోజును విషాద దినంగా భావిస్తూ ప్రతినెలా 30వ తేదీన నిర్వహించే కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీసు వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ విధంగా ప్రధాని, రాష్ట్ర ముఖ్య మంత్రులు ఆశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో వినతి పత్రం, తాను సీఎంకి, పీఎంకి పోస్టుచేసిన లేఖల నకలును అందజేశారు. ప్రకాష్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ అదర్స్‌ సుప్రీంకోర్టు తీర్పు 2006 ను 100 శాతం అమలు పర్చాలని వినతి పత్రంలో కోరారు. అలాగే పత్రికా స్వేచ్ఛను సవాల్‌ చేస్తున్నట్టుగా రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు పత్రికా కార్యాలయాలపై జరుపుతున్న దాడులు, విధ్వంస ధోరణిలను ఆయన ఖండిరచారు. అనంతరం తెనాలిలో తన ప్రచారం వాహనంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో గాంధీదేశం వెల్పేర్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *