Breaking News

సుపరిపాలనలో – తొలి అడుగు భవిష్యత్తుపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత మన అందరిపై ఉంది

-కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తున్నాము. రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు పట్టణం రోటరీ కల్యాణ మండపంలో రేపటి నుంచి అనగా బుధవారం తేదీ:2-7-2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము పై రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశానుసారం అవగాహన సదస్సు జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైంది. ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలియజేస్తూ రేపటి నుంచి జరిగే ఇంటింటికి జరిగే సుపరిపాలన పై తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మంత్రి వర్యులు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు దిశా నిర్దేశం చేశారు, “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము రేపటి నుంచి ప్రారంభం కానున్నదని తెలియజేస్తూ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని సంక్షేమం ప్రజలకు తెలియజేయాలని చూసించారు, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 75 శాతం హామీలు నెరవేర్చిందన్నారు,ఫించన్లు 3వేలు నుండి 4 వేలు పెంపు,తల్లికి వందనం 50 శాతం అధికంగా అందించిన ప్రభుత్వం మాది అన్నారు, గౌడ సోదరులకు వైన్ షాపు లలో 15 శాతం రిజర్వేషన్ కల్పన, నాయిబ్రాహ్మణులకు రూ,20 వేలు పెంచమన్నారు,200 యూనిట్లు విద్యుత్ రాయతీ,పద్మశాలీలకు 200 యూనిట్లు విద్యుత్ రాయతీ,దీపం పధకం అమలు, గొర్రెల కాపరులు ఋణాలు,మత్స్యకారులకు రూ,20 వేలు పెంచమన్నారు, త్వరలో విచిత బస్, అన్న దాత సుఖీభవ రూ,12 వేల నుండి రూ,20వేలు పెంచిన ప్రభుత్వం మాదన్నారు,కోకో రూ,300 పెంపు, మామిడి పంటకు ఇన్సూరెన్స్, కవర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు,రైతుల నుండి ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ,ఫామాయిల్ రైతులకు రూ,19 వేలు పెంచామన్నారు,ఈ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్లు,తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, స్థానిక కూటమి నేతలతో కలిసి సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లాలని తెలియజేసారు. కార్యక్రమములో మండల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆద్యఃక్షులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *