రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ఉదయం 09:19 గంటలకు రాజమహేంద్రవరం ప్రాంతంలోని ఆంధ్రా పేపర్ మిల్ లో హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ను తీసుకొచ్చిన జిజె 06 ఏయు – 9440 నంబరు గల వాహనము నుంచి రసాయన లీక్ అయినట్లు సమాచారం అందిందని ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె కృష్ణ మూర్తి లు ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఈ సమాచారం మేరకు, రాజమహేంద్రవరం అగ్నిమాపక కేంద్రం నుండి రెండు వాహనాలు మరియు కొవ్వూరు అగ్నిమాపక కేంద్రం నుండి మరో వాహనము, అలాగే ఆంధ్రా పేపర్ మిల్ వారి సొంత అగ్నిమాపక వాహనాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని రసాయనాన్ని తక్షణమే డైల్యూట్ చేయడం జరిగిందనీ అధికారులు తెలియ చేయడం జరిగింది. సదరు వాహనంలో మొత్తం 26 టన్నుల హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ఉన్నదిగా అంచనా వెయ్యడం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి అస్వస్థత లేదా హానీ కలగలేదు. పరిసరాల లోని ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ప్రాంతీయ అగ్ని మాపక అధికారి ఈ.స్వామి, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కె. కృష్ణమూర్తి కూడా ఘటన సమయానికి సంఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షణ చేయడం జరిగిందనీ, పరిస్థితి సాధారణ స్థితి కి చేరుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. సాధారణ స్థితిలోనే రసాయనాన్ని నిర్వీర్యం చేయడం జరిగిందనీ , భయాందోళనలు అవసరం లేదనీ సంబంధిత శాఖల అధికారులు తెలియ చేయడం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి ప్రాంతీయ అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్, జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి (రాజమహేంద్రవరం) , జిల్లా పరిశ్రమల అధికారి వాణిధర్ రామన్ హాజరై పర్యవేక్షణ చేపట్టారు.
Prajavartha Online Telugu News