మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మోకాళ్ళపై నిరసన…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 50 రోజులు దాటినా ప్రభుత్వం తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర ఉపాధ్యక్షుడు వేముల జైపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం, అలంకార్‌ సెంటర్‌ ధర్నాచౌక్‌లో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలో మోకాళ్ళపై నిరసన తెలియజేశారు. అధికారులందరికీ తమ గోడును విన్నవించుకున్నా కూడా ఖచ్చితమైన భరోసా కల్పించడంలో ఎందుకో జాప్యం జరుగుతుందని వాపోయారు. పెరిగిన రేట్లతో వచ్చే జీతాలు సరిపడక కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన దీక్షలో పిట్టా మహేష్ బాబు,  కార్మికులు, కమిటీ సభ్యులు, మున్సిపల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *