నిర్దిష్ట కాల వ్యవధిలో సర్వీసులు అందించాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా సేవలందించే విషయంలో చురుకుగా వ్యవహరించాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై నోడల్ అధికారులకు సామర్థ్య పెంపుపై శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, మున్సిపాలిటీ, పర్యాటక, జియస్, రిజిస్టేషన్ శాఖ, కార్మిక శాఖ, బాయిలర్లు, పరిశ్రమలు తదితర శాఖ అధికారులు ఈ విషయంలో ప్రధానంగా భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యాలయానికి భౌతికంగా రాకుండానే అలైన్ ద్వారా ధరఖాస్తు చేయడం సంబంధిత పత్రాలను పొందడంపై అవగాహన పరచాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో సర్వీసులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, ఆయా శాఖల కింద వివిధ విభాగాల వినియోగదార్లను సంతృప్తి పరిచే విధంగా సేవలందించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా ) కె. మోహన్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుధాకర్, ఏపిఎసి జోనల్ మేనేజర్ (శ్రీనివాసరావు, కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్ సిహెచ్ ఆషారాణి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ జె. శ్రీనివాసరావు, డిప్యూటి కంట్రోలర్ ఏ కృష్ణచైతన్య, సియంహెవో డా. జి గీతాబాయి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *