నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కింద జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి తీరుపై సమీక్షా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కింద జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి తీరుపై శనివారం కానూరులోని జిల్లా మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ కార్యాలయంలో విజయవాడ డివిజన్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, వసంతకృష్ణ ప్రసాద్, డా. మొండితోక జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్లు, డా. కె. మాధవీలత, శ్రీవాసు నూపూర అజయ్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, హౌసింగ్ పిడి కె.రామచంద్రన్, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు, ద్వామా పిడి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల్లో లెవెలింగ్, నీటి సరఫరా, విద్యుత్ అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం తదితర మౌలిక సదుపాయల పనులను ఈనెల 31 తేదీ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ళ కాలనీల్లో గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు పక్క ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పేదలందరికి ఇళ్లు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని అటువంటి కార్యక్రమం, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలనికి ఇసుక సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా చూడాలన్నారు. లబ్దిదారులకు ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా వుండాలన్నారు.
పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఉయ్యూరు రైవస్ కాలువ పక్కన వున్న లేఅవుట్ అప్రోచ్ రోడ్లు అభివృద్ధి పరచాలన్నారు. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో సుమారు 1000 మందికి ఇళ్ల నిర్మాణానికి ఎసెహెజ్ గ్రూపు మహిళలకు అదనపు రుణ సౌకర్యం కల్పించామన్నారు.
మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని స్థాయిలో అధికారులు సహకారం అందించాలన్నారు.
నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ప్రజలకు అవసరమైన వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. త్రాగునీరు, విద్యుత్ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలన్నింటిని కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో విజయవాడ డివిజన్లోని తహాశీల్దార్లు, యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు, హౌసింగ్ , ఆర్‌డబ్ల్యుఎస్, గనులు, విద్యుత్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *