విజయ శంకర సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపల్ (ఎఫ్ ఎ సి) గా పసుమర్తి శ్రీనివాస శర్మ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ (ఎఫ్ ఎ సి) గా పసుమర్తి శ్రీనివాస శర్మ బాధ్యతలు స్వీకరించారని పాఠశాల యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ప్రిన్సిపల్ గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి పదోన్నతి పై విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు బదిలీ అవడంతో కూచిపూడి నృత్య సహోపన్యాసకులైన శ్రీనివాస్ శర్మ ప్రిన్సిపల్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2024లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పొందిన ఆయన, 1992లో జర్మనీ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా పొందారు. ఫ్రాన్స్ (1985), జర్మనీ (1992) లలో జరిగిన భారత ప్రభుత్వ ఉత్సవాలలో పాల్గొన్నారు. కూచిపూడి నర్తన శిరోమణి, యక్ష గంధర్వ కళా బంధు, కూచిపూడి నాట్య పరిశోధన ఆచార్య మున్నగు బిరుదులు ఆయన పొందారు. 2016 లో డాక్టరేట్ పొందిన ఆయన నాట్యం పై పది పుస్తకాలు కూడా రచించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆయనకి అభినందనలు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *