ఓటరు నమోదు, ఎన్నికల విధులు పై బిఎల్‌వోలకు శిక్షణ

-ఎస్డీసీ ఎస్ సరళ వందనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ఓటరు నమోదు మరియు ఎన్నికల విధుల్లో వారి పాత్రపై విస్తృత శిక్షణ ఇవ్వడం జరిగిందని నియోజకవర్గ ఎలెక్టోరల్ అధికారి మరియు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్. సరళ వందనం తెలిపారు. బుధవారం మొదటి బ్యాచ్ బిఎల్‌వో లకి శిక్షణ కార్యక్రమం స్థానిక రూరల్ ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎలెక్టోరల్ అధికారి మరియు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్. సరళ వందనం మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో బిఎల్‌వోలు కీలక పాత్ర పోషిస్తారని, శిక్షణ ద్వారా వారి పనితీరులో మెరుగుదలకు అవకాశం లభిస్తుందని తెలిపారు.బిఎల్‌వోల విధులు, బాధ్యతలు పై వివరాలు తెలియ చేస్తూ బూత్ స్థాయి అధికారులుగా (B.L.O.) నియమితులైన వారు ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణల ప్రక్రియను నిబంధనల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల అభ్యర్ధనలు సమీక్షించి, డోర్ టు డోర్ పద్ధతిలో వివరాలు సేకరించాలన్నారు. వయస్సు , చిరునామా ఆధారాలు పరిశీలించాలనీ, నిష్పాక్షికంగా పనిచేసి, ఓటింగ్ హక్కు ఉన్న ప్రతి అర్హులైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయించే బాధ్యత బిఎల్‌వోలపై ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో విధించిన బాధ్యతలను నిర్వహించడంతోపాటు, నిబంధనలు మరియు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నియోజక వర్గంలో 241 మంది బూత్ స్థాయి అధికారులకి ఆరు బ్యాచ్ లుగా శిక్షణ జూలై 17 వరకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్ ఆర్.ఎస్.ఎన్ నాగ శిరీష దేవి బూత్ స్థాయి అధికారులకు వివిధ దశల్లో వారి బాధ్యతలు, ప్రక్రియలు పై వివరంగా శిక్షణ అందించారు. అనంతరం సర్టిఫికెట్స్ అందచేశారు. కార్యక్రమంలో రూరల్ ఇంచార్జి తహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ చైతన్య, మాస్టర్ ట్రైనర్ శిరీష, బిఎల్‌వోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *